Most Recent

Atlee: మొదటిసారిగా కుమారుడి ఫొటో షేర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ.. సమంత కామెంట్ వైరల్‌

Atlee: మొదటిసారిగా కుమారుడి ఫొటో షేర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ.. సమంత కామెంట్ వైరల్‌
Samantha, Director Atlee

రాజారాణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్‌ అట్లీ. ఆతర్వాత తేరి, మెర్సల్‌, బిగిల్‌ వంటి సినిమాలతో స్టార్‌ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. తెలుగులోనూ ఈ సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఏకంగా షారుఖ్ ఖాన్‌ తో సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల సంగతి సంగతి పక్కనపెడితే డైరెక్టర్ అట్లీ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి క్రిష్ణ ప్రియ జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు తన కుమారుడి ముఖాన్ని చూపించలేదు అట్లీ దంపతులు. చాలామంది లాగే తమ బిడ్డ ఫొటోలను గోప్యంగా ఉంచారు. అయితే తాజాగా తమ కుమారుడి ఫొటో పాటు పేరు కూడా రివీల్ చేశారీ లవ్లీ కపుల్‌. ప్రస్తుతం జవాన్‌ షూటింగ్‌ కోసం ముంబైలోనే ఉన్న అట్లీ తన భార్య, పిల్లాడితో కలిసి ప్రసిద్ధ సిద్ధి వినాయక టెంపుల్‌ను దర్శించుకున్నారు.

ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అట్లీ ..కొడుకు పేరు ‘మీర్’ (Meer) అని రివీల్ చేశాడు. అయితే ఈ పిక్‌లో మీర్ ఫేస్ కనబడకుండా లవ్ సింబల్ ఎమోజీతో కవర్ చేశారు. అలాగే తమ బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్థనలు కావాలంటూ అందరినీ కోరారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అట్లీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్‌ హీరోయిన్‌ సమంత ‘కంగ్రాట్స్ డార్లింగ్స్’ అని కామెంట్ చేసింది. ఆతర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఎమోజీ సింబల్స్‌తో కూడిన అట్లీ ఫొటోను కూడా షేర్ చేసింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి (తెలుగులో పోలీసోడు), మెర్సల్‌ (తెలుగులో అదిరింది) సినిమాల్లో విజయ్‌కు జోడీగా సామ్ నటించింది.

అట్లీ, ప్రియ దంపతుల పోస్ట్

 

View this post on Instagram

 

A post shared by Priya Mohan (@priyaatlee)

 

View this post on Instagram

 

A post shared by Priya Mohan (@priyaatlee)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.