Most Recent

The Kerala Story: బాక్సాఫీస్‌ వద్ద ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. మరో 37 దేశాల్లో రిలీజ్‌కు రెడీ

The Kerala Story: బాక్సాఫీస్‌ వద్ద ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. మరో 37 దేశాల్లో రిలీజ్‌కు రెడీ
The Kerala Story Movie

ఆదాశర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రాజకీయంగా సెగలు రేపుతోంది. బీజేపీ నాయకులు ది కేరళ స్టోరీకి మద్దతు తెలుపుతుండగా, విపక్ష పార్టీలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. భద్రతా పరమైన కారణాలతో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఈ మూవీని బ్యాన్‌ చేస్తే, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలు మాత్రం ఈ మూవీకి పన్ను మినహాయింపు ప్రకటించాయి. వివాదాల సంగతి పక్కన పెడితే ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.56 కోట్లకిపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. రోజురోజుకి వసూళ్లు పెరగడంతో ఈ సినిమాని అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మే 12న ఏకంగా 37 దేశాల్లో ది కేరళ స్టోరీని విడుదల కానుందని హీరోయిన్‌ అదాశర్మ తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్‌ చేసిన అదా శర్మ.. ఈ సినిమాని, తాను పోషించిన పాత్రను ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

ది కేరళ స్టోరీ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్‌ పాత్రలో నటించి మెప్పించింది అదాశర్మ. ముగ్గురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. అయితే, తప్పిపోయిన ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ కీలక పాత్రల్లో నటించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.