

సూపర్ స్టార్ రజనీకాంత్ కు వరస షాకులు తగులుతున్నాయి. మొన్న పెద్ద కూతురి ఇంట్లో భారీ దొంగతనం జరగ్గా.. తాజాగా చిన్న కుమార్తె ఇంట్లో చోరీ జరిగింది. చిన్నకూతురు సౌందర్య తన ఎస్‌యూవీ కారు కీ కనిపించడం లేదంటూ సౌందర్య రజనీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు అయింది. ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేలోగా తన ఎస్‌యూవీ కారు కీ కనిపించకుండా పోయిందని సౌందర్య తన ఫిర్యాదులో తెలిపారు. ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు చోరీకు గురైనట్లు గుర్తించిన ఆమె ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన నెలన్నరకు రజనీ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఇలా వరుసగా రజనీకాంత్ కూతుళ్ల ఇళ్లలో వరుసగా చోరీలు జరగడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.
మార్చి నెలలో ఐశ్వర్య రజనీకాంత్ తన ఇంట్లో రూ.60 లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఐశ్వర్య అనుమానమే నిజమైంది. ఆమె ఇంట్లో పని చేసిన ఆ ముగ్గురే చోరీకి పాల్పడ్డారని తేలింది. దొంగిలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా కొంతకాలంగా ఐశ్వర్య ఇంట్లోని విలువైన వస్తువులను సైతం దొంగిలిచినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..