Most Recent

Samantha Ruth Prabhu: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత

Samantha Ruth Prabhu: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత
Samantha

సమంత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది సామ్. ఆ సినిమా నుంచే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో నటించిన దూకుడు, పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది సినిమాలు ఈ అమ్మడి రేంజ్ ను పెంచేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.

ఇదిలా ఉంటే ఈ ఈ మైదా కాలంలో నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. నిన్నమొన్నటి వరకు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సమంత ఇప్పుడు హాలీవుడ్ లో అడుగుపెట్టనుంది తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ హాలీవుడ్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సమంత కూడా హాలీవుడ్ లో సినిమా చేయనుందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సమంత ‘చెన్నై స్టోరీ’ అనే హాలీవుడ్ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి, చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.