Most Recent

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. ఓజీ మూవీ క్రేజీ అప్డేట్

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. ఓజీ మూవీ క్రేజీ అప్డేట్
Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు రాజకీయాలతో పాటు, సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు పవన్. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో గ్యాప్ లేకుండా గడుపుతున్నారు. పవన్ క్రేజీ సినిమాలు లైనప్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో వైపు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటితో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. వీటితో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా సినిమా చేస్తున్నారు పవన్.

ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఆసక్తికర టైటిల్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఓజీ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లోగా సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తానని చెప్పారట. దీనికి తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని చెప్పేశారట. పవన్ ‘బ్రో’ సినిమా తర్వాత ఈ ఓజీని రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.