Most Recent

Sr.NTR Satha jayanthi: నేడు ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్ , బాలయ్య..

Balakrishna And Jr Ntr Nandamuri Family Members Pays Tribute To Sr.ntr Live Video Telugu News Video

ఈరోజు మే 28 నందమూరి తారకరామరావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్. సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్. జూనియర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. ఘాట్‌ వద్దకు ఫ్యాన్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. అంతకు ముందు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌‌కు వచ్చారు. సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు. తెలుగువారికి ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం అని చెప్పారు బాలకృష్ణ. ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్‌ నాంది పలికారని బాలకృష్ణ తెలిపారు. ‘ఎన్టీఆర్‌ యుగపురుషుడు. ఆయన నెలకొల్పిన తెలుగు దేశంపార్టీ ఓ ప్రభంజనం. ప్రజాసంక్షేమాన్ని ప్రవేశపెట్టిన మొదటి సీఎం ఎన్టీఆర్‌. నటనలో తొలి పది స్థానాలు ఆయనవే’ అని బాలకృష్ణ తెలిపారు. వీరితో పాటు నందమూరి రామకృష్ణ ఇతర నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.