Most Recent

NTR Birth Anniversary: తెలుగువారికి ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం.. నివాళి అర్పించిన బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌

NTR Birth Anniversary: తెలుగువారికి ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం.. నివాళి అర్పించిన బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌
Ntr Birth Anniversary

ఇవాళ (మే 28) నందమూరి తారకరామరావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్. సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్. జూనియర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. ఘాట్‌ వద్దకు ఫ్యాన్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. అంతకు ముందు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌‌కు వచ్చారు. సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు. తెలుగువారికి ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం అని చెప్పారు బాలకృష్ణ. ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్‌ నాంది పలికారని బాలకృష్ణ తెలిపారు. ‘ఎన్టీఆర్‌ యుగపురుషుడు. ఆయన నెలకొల్పిన తెలుగు దేశంపార్టీ ఓ ప్రభంజనం. ప్రజాసంక్షేమాన్ని ప్రవేశపెట్టిన మొదటి సీఎం ఎన్టీఆర్‌. నటనలో తొలి పది స్థానాలు ఆయనవే’ అని బాలకృష్ణ తెలిపారు. వీరితో పాటు నందమూరి రామకృష్ణ ఇతర నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

 

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ శ్రేణులు యుగ పురుషునికి ఘన నివాళులు అర్పిస్తున్నాయి. ఎన్.టి.ఆర్. కాగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజమాబాద్‌ జిల్లా వర్ని లో ఎన్టీఆర్‌ క్యాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ పోచారం. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్. వారసుడు రామ కృష్ణ పాల్గొన్నారు. ‘1949 లో మనదేశం తో ఎన్టీఆర్ నినీ రంగప్రవేశం చేశారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవారిలో సగం మంది ఎన్టీఆర్ వారసులే. సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్. ఉచిత కరెంటు ఘనత ఎన్టీఆర్ దే. పార్టీలు వేరైనా ఎన్టీఆర్ వారసులమే. ఆయన స్ఫూర్తే మాకు ఆదర్శం. మాకు ఏ పదవి వచ్చినా అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షనే. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపీ గా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవాడిని. ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్. సుస్థిర పాలనతో అభివృద్ధి సాధ్యం’ అని పోచారం తెలిపారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.