Most Recent

Balagam: కరీంనగర్‌ జిల్లాలో ‘బలగం’ క్లైమాక్స్‌ రిపీట్‌.. కాకి ముట్టలేదని ఆ పని చేసిన కుటుంబ సభ్యులు

Balagam: కరీంనగర్‌ జిల్లాలో ‘బలగం’ క్లైమాక్స్‌ రిపీట్‌.. కాకి ముట్టలేదని ఆ పని చేసిన కుటుంబ సభ్యులు
Balagam Movie

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బలగం సినిమా సన్నివేశం రిపీటయ్యింది. ఐదు రోజులనాడు ఆడపిల్లల పండుగ చేసి..కాకికి పెట్టగా సినిమాలో అది ముట్టకపోవటం చూశాం. అందులో అల్లుడు ఫారిన్ మందు తీసుకొచ్చి మొత్తం బాటిల్‌ మందును శాఖ పెడతాడు. అయినా కాకి రాదు. అంతే కాదు.. క్లైమాక్స్‌లో దినకర్మ రోజు కూడా పిట్ట ముట్టదు..చివరికి కొమురయ్యకు ఎంతో ఇష్టమైన ఫొటోను తీసుకొచ్చి పెట్టగానే..పిట్ట వచ్చి భోజనం ముడుతుంది. అయితే.. ఇక్కడ కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. తెలంగాణ రాష్ట్రమంతా బలగం సినిమాకు ఎంతగా కనెక్టయ్యిందంటే..ఆ సినిమా చూసి ఏళ్ల కింద విడిపోయిన అన్నదమ్ములు, అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెల్లు.. ఇలా చాలా మంది కలిసిపోయారు. అంతే కాదు..ఆ సినిమా క్లైమాక్స్‌లో జరిగిన సన్నివేశాలే ఇప్పుడు గ్రామాల్లో రిపీటవుతున్నాయి. కరీంనగర్‌జిల్లా ఆబది జమ్మికుంటలో అదే జరిగింది. గ్రామానికి చెందిన పూదరి వెంకటరాజం గౌడ్ 5 రోజుల క్రితం చనిపోయాడు. ఆయన ముగ్గురు కొడుకులు, బంధువులు ఆయనకు ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్ని తయారు చేసి కాకికి పెట్టారు. అయితే.. బలగం సినిమాలో చూపెట్టినట్టే..ఆ నైవేద్యాన్ని ఒక్క పిట్ట కూడా వచ్చి ముట్టలేదు. వెంకటరాజం కొడుకులు రకరకాల ప్రయత్నాలు చేశారు.అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇంకేమైనా మర్చిపోయామా..అంటూ చెక్ చేసుకున్నారు.

వెంకటరాజంకు చిన్నతనంలో పేకాట అంటే చాలా ఇష్టమని తెలుసుకొని ఒక ప్లేట్లో పేక ముక్కల కట్టను..వాటితో పాటు 10 రూపాయల నోటును తీసుకొచ్చి పెట్టారు. అది పెట్టిన కొదిసేపటి తర్వాత పక్షి వచ్చి ముట్టింది. ఆహార పదార్థాలను తినడంతో కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిచిందని భావిస్తున్నట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఏదిఏమైనా ఒక సినిమా వీరి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.