Most Recent

Anushka Sharma: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మెరిసిన బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ.. ఫిదా చేసిన బ్యూటీ

Anushka Sharma: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మెరిసిన బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ.. ఫిదా చేసిన బ్యూటీ
Anushka Sharma

ఫ్రాన్స్‌ వేదికగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగింది. చివరిరోజున బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ సందడి చేశారు. వైట్‌ డ్రెస్‌లో రెడ్‌ కార్పెట్‌పై దేవకన్యను తలపించారు..ఫ్రాన్స్‌ వేదికగా కొనసాగిన 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గ్రాండ్‌గా ముగిసింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోయారు ముద్దుగుమ్మలు. రకరకాల డ్రెస్సులతో అదరగొట్టారు. స్టేజ్‌పై ఫోజులిస్తూ అలరించారు. అంగరంగ వైభవంగా వివిధ దేశాల తారలు, నటీనటులు, టెక్నీషియన్స్, డిజైనర్లు, మోడళ్లతో కేన్స్‌ కిటకిటలాడింది.

కేన్స్‌ 2023 ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 16న ప్రారంభం కాగా.. భారత్‌ నుంచి పలువురు తారలు విభిన్న దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై మెరిసారు. చివరిరోజున బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ పాల్గొని సందడి చేశారు. ఫ్లవర్‌ షేప్‌లో ఉన్న వైట్‌ డ్రెస్‌లో రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. దేవకన్యలా కళకళలాడుతూ కనిపించారు అనుష్కా శర్మ.

దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇక.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వెళ్లారు. కానీ.. అనుష్క శర్మకు మాత్రం ఇది ఫస్ట్ కేన్స్ వేడుక. ఇంతకుముందు ఎప్పుడూ ఈ బ్యూటీ కేన్స్‌ వెళ్ళలేదు. దాంతో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అనుష్కశర్మకు స్పెషల్‌గా మారింది. మొత్తంగా.. పది రోజులపాటు అట్టహాసంగా కొనసాగాయి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.