Most Recent

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు ఏపీ సర్కారు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ..

Sarkaru Vaari Paata Ap Govt

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడుతూ ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరశురామ్‌ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే శనివారం సాయత్రం ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్‌.

ఈ క్రమంలోనే సర్కారు వారి పాట చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. సినిమా టికెట్‌ ధరను పెంచుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా జారీ చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో టికెట్ల ధరలను పెంచమన్న చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం హై బడ్జెట్‌ క్యాటగిరీలో రూ. 45 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించారు. అయితే దీనికి కేవలం 10 రోజులు మాత్రమే, ఆ తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం గతంలో RRR, ఆచార్య సినిమాలకు కూడా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Sarkaru Vaari Paata Ap

బ్యాంక్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్‌ బాబు సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఇక మహేష్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు కనిపించని పాత్రలో కనిపించనున్నాడని దర్శకుడు పరశురామ్‌ తెలపడంలో సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ భారీగా పెరిగింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Bank Branches: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. 600 బ్రాంచ్‌ల మూసివేతకు రంగం సిద్ధం..? ఎందుకంటే..!

Cuba Explosion: భారీ పేలుళ్లతో దద్దరిల్లిన క్యూబా.. 18 మంది మృతి, 64 మందికి గాయాలు

Fixed Deposit: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.