Most Recent

Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో కమల్ సందడి.. మీరు గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అంటున్న కపిల్

The Kapil Sharma Show

The Kapil Show: బుల్లి తెరపై కపిల్ శర్మ (Kapil Sharma) షో ఓ స్పెషల్. ఈ షోకి చాలామంది సెలబ్రెటీలు అతిథులుగా హాజరయ్యి.. నవ్వులు పూయిస్తుంటారు. ఈ ప్రత్యేక అతిథులతో ఆ షోకే స్పెషల్ గుర్తింపు వచ్చిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, కమెడియన్స్ ఇలా అనేక మంది కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. అయితే ఈసారి కపిల్ షోలో లెజెండ్ నటుడు అడుగు పెట్టాడు. లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నవ్వులు పూయిస్తున్నారు. కపిల్‌తో సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఈ షోలో కనిపించింది సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కపిల్ శర్మ తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నాడు. కమల్ హాసన్ రాకతో తన కల నెరవేరిందని అంటున్నారు కపిల్ శర్మ. కపిల్ షోలో కమల్ హాసన్ ఎంట్రీ జరగడం ఇదే తొలిసారి.

కమల్ హాసన్‌తో షూటింగ్‌..అవధులు లేని ఆనందంలో కపిల్: తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని కపిల్ శర్మ తన అభిమానులకు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. కపిల్ కమల్ హాసన్‌తో సెట్స్‌లో ఎలా సరదాగా గడుపుతున్నాడో ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు చెప్పాడు.

కపిల్ శర్మ పోస్ట్‌:

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

కమల్ హాసన్  ‘విక్రమ్’మూవీ: కమల్ హాసన్  తన తాజా సినిమా ‘విక్రమ్’ సినిమా ప్రమోషన్ కోసం ‘ది కపిల్ శర్మ షో’కి వెళ్లాడు. ఈ విషయాన్ని కపిల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలి-పాడు. తన కల నెరవేరింది.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్‌తో గడిపిన అందమైన, అద్భుతమైన సమయని కామెంట్ చేశాడు. కమల్ హాసన్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి.. మా షోని అందంగా తీర్చిదిద్దినందుకు చాలా ధన్యవాదాలు సార్ అని చెప్పాడు కపిల్ శర్మ.

కమల్ హాసన్ రాబోయే చిత్రం విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో కమల్ హాసన్‌తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా తెరపై కనిపిస్తారు. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షోకి కపిల్ రాకతో ఈ సినిమా చర్చ జోరందుకుంది. ఈ చిత్రం నుండి కమల్ హాసన్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పుడు, అభిమానులు అతని చిత్రంపై నమ్మకంతో ఉన్నారు, వారు ఇప్పుడు దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Thailand: అతనొక విశ్రాంత ఆర్మీ డాక్టర్.. భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు చేశాడంటే?

Corona Virus: మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా.. మెడికల్ కాలేజీలో 25 స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.