Most Recent

Sarkaru Vaari Paata: సినిమాలో మహేశ్‌ను చూస్తే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవాల్సిందే.. పరుశురామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస విజయాల తర్వాత మహేష్‌ నటిస్తోన్న సినిమా కావడంతో సర్కారు వారి పాటపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా మహేష్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక గీత గోవిందంతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండడం కూడా ఈ సినిమాకు మంచి టాక్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నరు మేకర్స్‌.

సినిమా తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు పరశురామ్‌ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పాట చిత్రాన్ని పోకిరీతో పోల్చడంపై మీ అభిప్రాయం ఏంటి.?’ అన్ని ప్రశ్నకు బదులిచ్చిన పరశురామ్‌.. ‘పోకిరి బయటకు కనిపించిన పోలీస్‌ కథ. ఇది మాత్రం ఒక సాధారణ పౌరుడి కథ. ఇందులో మహేష్‌ మరికొంచెం ఓపెన్‌ అయినట్లు ఉంటారు. ఆయన లుక్‌, మేనరిజం, హావభావాలు చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా మహేష్‌ డ్యాన్స్‌లు ఉర్రూతలూగిస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా బ్యాంక్‌ నేపథ్యంలో సాగుతుందనేది నిజమే కానీ, మహేష్‌ మాత్రం బ్యాంక్‌ ఉద్యోగి కాదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మహేష్‌ ఒంటిపై కనిపించే పచ్చబొట్టు వెనకా ఓ కథ ఉందని ఆసక్తికర విషయాన్ని తెలిపారు పరశురామ్‌. ఇక సర్కారు వారి పాట సినిమాను మహేష్‌ బాబుని దృష్టిలో ఉంచుకునే సిద్ధం చేశానని తెలిపిన పరశురామ్‌, ఆయనతో సినిమా చేయాలనే తన కల నిజమైందని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్

TSRTC Bumper Offers: మహిళలకు టీఎస్‌ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. ఏసీ బస్సులతో సహా అన్నింట్లోనూ ఉచిత ప్రయాణం..!

COVID-19 Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని బలవంతం చేయొద్దు.. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కోవిడ్‌ వ్యాప్తి చెందదన్న ఆధారాలు లేవు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.