Most Recent

Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..

Nayanthara Vignesh

Nayanthara-Vignesh: దక్షిణాది (South India) స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ కోలీవుడ్ ల‌వ్‌బ‌ర్డ్స్  న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ లు పెళ్లి ముహర్తం ఫిక్స్ చేస్తుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లో స్వామివారి సన్నిధిలో నయన్, విగ్నేష్ లు ఒకటి కాబోతున్నారు.. జూన్ 9న ఈ జంట వివాహ బంధంలోకి ఇరు కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకోనున్నారు. ఇందుకోసం నయనతార, విగ్నేష్ లు తిరుమల తిరుపతికి తమ పెళ్లి వేదికను బుక్ చేసుకోవడానికి వచ్చినట్లు సమాచారం.

ఈరోజు తిరుమల శ్రీవారిని నయనతార, విఘ్నేష్ శివన్ జంట దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.  గత రెండు రోజుల క్రితం ఈ జంట షిర్డీ సాయిబాబాను కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే.

నయనతార తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మైన నానుమ్ రౌడీథాన్ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించింది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఏడేళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట తమ మధ్య ఉన్న బంధాన్ని ర‌హ‌స్యంగా ఉంచాలని ఏ రోజూ ప్రయత్నించలేదు. అంతేకాదు ఏడేళ్లుగా క‌లిసి జీవిస్తున్న నయన్రు, విగ్నేష్ లు తమ జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి సాక్ష్యాలుగా నిలిచే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Thailand: అతనొక విశ్రాంత ఆర్మీ డాక్టర్.. భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు చేశాడంటే?

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.