
సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) మోస్ట్ అవేటెడ్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మహేష్ సినిమా అంటే మామూలుగానే అభిమానులు హంగామా చేస్తారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బెనిఫిట్ షోస్ మొదలవ్వడంతో సినిమా సూపర్ హిట్ అనే టాక్ బయటకు వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. పోకిరి సినిమా తర్వాత మహేష్ మళ్ళీ ఆ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటటైనర్ తో అభిమానుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో హోరెత్తించిన చిత్రయూనిట్ సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. ఇక టీజర్ , ట్రైలర్ అయితే సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇప్పడు ఆ అంచనాలను సినిమా అందుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



