Most Recent

Sai Pallavi: ఎప్పటి నుంచో దాచిన రహస్యాన్ని చెప్పేయనున్న సాయి పల్లవి.. హైబ్రిడ్‌ పిల్లా ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Saipallavi

Sai Pallavi: 2015లో వచ్చిన మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార సాయి పల్లవి. తొలి సినిమాతోనే తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. పేరుకు మలయాళ చిత్రమే అయినప్పటికీ తన సహజ అందంతో సౌత్‌ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారి తనవైపు తిప్పికుంది. ఇక ‘ఫిదా’ చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తెలుగు కుర్రకారును నిజంగానే ఫిదా చేసింది. తనదైన అందం, సహజ నటనతో ఆకట్టుకుంది. దీంతో సాయి పల్లవికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఏ సినిమా పడితే అది ఓకే చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది వరుస హిట్‌లు అందుకుంటూ పోయింది.

ఇక ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతోన్న విరాట పర్వంలో నటిస్తోన్న సాయి పల్లవి.. తన తర్వాతి చిత్రంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొత్త సినిమా ప్రకటన చేయకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఒకానొక సమయంలో సాయి పల్లవి వివాహం చేసుకోనుందని, అందుకే కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ ఎట్టకేలకు తన కొత్త సినిమాకు సంబంధించి ప్రకటన చేసేసింది. ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను పోస్ట్‌ చేసింది. ఇందులో చీర కట్టుకున్న ఓ యువతి బ్యాగు వేసుకొని గాల్లో ఎగురుతూ ఉన్నట్లు ఉంది.

ఈ ఫొటోను ట్వీట్ చేసిన సాయి పల్లవి.. ‘ఆమె చాలా కాలంగా ఓ సర్‌ప్రైజ్‌ను దాస్తోంది. నాకు తెలిసి, ఈ సోమవారం అంటే మే 9న ఆమె మిమ్మల్ని చూడడానికి సిద్ధమైంది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చింది. దీంతో సాయిపల్లవి కొత్త సినిమా విషయంలో జరుగుతోన్న ప్రచారానికి చెక్‌ పెట్టినట్లైంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి తాజా చిత్రం విరాటపర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్‌ను ప్రేమించే యువతి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.