Most Recent

Kajal Aggarwal: తనయుడిని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసిన కాజల్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌తో..

Kajal

Kajal Aggarwal: టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నిత్యం సినిమాలు, యాడ్స్‌ షూటింగ్స్‌తో బిజీగా గడిపే కాజల్‌ ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. పూర్తి సమయాన్ని తన కుమారుడు ‘నీల్‌’ కోసమే కేటాయిస్తోంది. ఇదిలా ఉంటే డెలివరీ తర్వాత తాజాగా తన లేటెస్ట్ ఫోటోను అభిమానులతో పంచుకున్న తాజాగా తన బాబును ప్రపంచానికి పరిచయం చేసింది. మాతృ దినోత్సవం (మే 8) సందర్భంగా తనయుడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కాజల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ను రాసుకొచ్చింది.

తన కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ‘డియర్‌ నీల్‌.. నువ్వు నాతో గడపబోయే అద్భుత క్షణాలను తలుచుకుంటున్నాను. నిన్ను తొలిసారి నా చేతుల్లోకి తీసుకున్న క్షణంలో, నీ వెచ్చని శ్వాసను నేను అనుభూతి చెందాను. నీ అందమైన కళ్లను చూశాను. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నా మొదటి సంతానం, నా తొలి కుమారుడివి, ఇకపై నాకంతా నువ్వే. భవిష్యత్తులో నేను నీకు అన్ని నేర్పించడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తాను, కానీ నువ్వు నాకు ఇప్పటికే ప్రేమంటే ఏంటో నేర్పించావు’ అంటూ రాసుకొచ్చింది కాజల్‌.

ఇక తన కుమారుడి భవిష్యత్తు గురించి భగవంతుడిని ప్రార్థిస్తూ.. ‘నువ్వు బలమైన వ్యక్తిగా, ఇతరులకు ప్రేమను పంచేవాడిగా ఎదగాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచం నీ సంతోషాన్ని ఎప్పటికీ మసకబారనివ్వకూడదని, ఎప్పుడూ ధైర్యం, దయ, సహనంతో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు సర్వస్వం. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూ’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది కాజల్‌.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.