Most Recent

Rama Rao On Duty: రామారావు రొమాంటిక్‌ యాంగిల్‌.. ఆకట్టుకుంటోన్న ‘సొట్టల బుగ్గల్లో’ లిరికల్ సాంగ్‌..

Ram Rao On Duty

Rama Rao On Duty: మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామరావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ‘సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా’ అనే లిరికల్ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు.

కళ్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను హరిప్రియ, నకుల్‌ అభ్యంకర్‌ పాడారు. అందమైన మెలోడీ ట్యూన్‌తో రూపొందించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. రవితేజ, దివ్యాంశ జోడీగా తెరకెక్కిన ఈ పాట ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగుంది. రొమాంటిక్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాటను మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుల్ బుల్‌ తరంగ్‌ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..’ అనే లిరికల్‌ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేష్‌, పవిత్రా లోకేష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలిసిన స్టార్‌ కమెడియన్‌.. తన సంతోషాన్ని ఎలా షేర్‌ చేసుకున్నాడో తెలుసా?

AIIMS Bibinagar Recruitment 2022: తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.67700ల జీతం..

Tirupati Special Trains: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్స్.. వివరాలు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.