Most Recent

KGF actor: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత..

Actor Mohan Juneja Died

శాడ్ న్యూస్… కేజీఎఫ్ మూవీ అందరూ చూసే ఉంటారు. అందుకే హీరో రాఖీ భాయ్ పాత్ర గురించి.. జర్నలిస్ట్‌కి చెబుతూ ఎలివేట్ చేసే పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది.  ఆ పాత్ర పోషించింది..  ప్రముఖ కన్నడ నటుడు, కమెడియన్ (Mohan Juneja) మోహన్ జునేజా(54). ఆయన దీర్ఘకాల కాలేయ వ్యాధితో పోరాడుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన ఈ వ్యాధికి ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. అయితే, ​చికిత్సకు ఆయన స్పందించలేదని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన వైద్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.  మోహన్ జునేజా మృతిపై పలువురు కన్నడ సినీ ప్రముఖులు(kannada Film Stars), రాజకీయ నాయకులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జునేజా అంత్యక్రియలు శనివారం సాయంత్రం బెంగళూరులోని తమ్మెనహళ్లి(Thammenahalli)లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మొత్తం 150కి పైగా చిత్రాల్లో నటించారు మోహన్ జునేజా. ఆయన సొంతూరు తుమకూరు. ఎక్కువగా కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ నటుడు.. అడపాదడపా మలయాళం, తెలుగు,  హిందీ భాషల్లోనూ నటించారు.  లక్ష్మీ, బృందావన, కోకో, కేజీఎఫ్ ఛాప్టర్ 1, 2 వంటి కన్నడ సినిమాల్లో ఆయన కీ రోల్స్ పోషించారు. బుల్లి తెరపై కూడా రాణించారు. కన్నడనాట బాగా పాపులర్ అయిన ‘వటారా’ సీరియల్​లో కీలక పాత్ర పోషించారు. జునేజాకు భార్య కుసుమ, అక్షయ, అశ్వినీ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

Also Read: LPG price: సామాన్యుడికి చమురు కంపెనీలు షాక్‌.. గ్యాస్‌ వినియోగదారునిపై మరో బండ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.