Most Recent

Ormax Media: తెలుగులో టాప్‌ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా.? ఓర్మాక్స్‌ మీడియా సర్వేలో తేలిన విషయాలివే..

Tollywood

Ormax Media: సినిమాల్లో టాప్‌ హీరో, హీరోయిన్లు ఎవరనే ప్రశ్న ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. అయితే సినిమాల జయాపజయాల ఆధారంగా సినీ తారల స్థానాలు మారుతూ ఉంటాయి. అందుకే ఎవరు టాప్‌లో ఉన్నారన్న విషయంపై అంత సులభంగా ఓ అంచనాకు రాలేము. అయితే ప్రేక్షకుల ఆదరణ, వారు ఎవరి నటనకు ఓటేస్తారన్న అంశాల ఆధారంగా మాత్రం కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు పాపులర్‌ నటుల జాబితాను విడుదల చేసింది.

ఓర్మాక్స్‌ మీడియా అనే ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ వివిధ సినిమా పరిశ్రమల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంపై తరచూ సర్వే నిర్వహిస్తుంటుంది. ఇందులో పలు సినీ పరిశ్రమల్లో టాప్ హీరో, హీరోయిన్లు ఎవరనే విషయంలో టాప్ 10 జాబితా ప్రకటించింది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ హీరోగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నిలిచారు.

ఇక హీరోయిన్ల విషయానికొస్తే సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ తర్వాత ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల జాబితా విషయానికొస్తే సమంత తర్వాత.. కాజల్ అగర్వాల్‌, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు.

బాలీవుడ్‌ జాబితా విషయానికోస్తే.. అక్షయ్‌ కుమార్‌ మొదటి స్థానంలో నిలవగా, తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్‌ ఉన్నాడు. మోస్ట్‌ పాపులర్ హిందీ హీరోయిన్‌గా అలియా భట్‌ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్‌, కృతి సనన్‌ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.