
Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేశ్ (Keerthy Suresh) మహేశ్ పక్కన సందడి చేసింది. ఈఎమ్‌ఐలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ పరశురామ్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. భారీ అంచనాల నడుమ మే12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్లకు పైగా రాబట్టిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) వీకెండ్‌లో మరింత జోరు చూపించింది. BlockbusterSVP హ్యాష్‌ట్యాగ్‌తో మహేశ్ మానియా ఏంటో మరోసారి నిరూపించింది.
ఓవర్సీస్ లోనూ మహేశ్ మానియా..
కాగా మూడు రోజులకు గాను సర్కారు వారి పాట సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 12.01 కోట్ల రేంజ్‌లో షేర్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు 14.01 కోట్ల షేర్‌ను 22 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను అందుకుందని తెలుస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కలిపి రూ.59.06 షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గ్రాస్ వసూళ్లలో చూస్తే రూ.84.40 కోట్లు. ఇక ఓవర్సీస్‌లోనూ సర్కారువారి పాట దుమ్మురేపుతోంది. అమెరికాలో ఇప్పటికే 1.8 మిలియన్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఇక ఆదివారం కూడా సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర హౌస్‌ఫుల్ కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ ఏడాదిలో 100 కోట్ల గ్రాస్ సాధించిన నాలుగో చిత్రంగా సర్కారు వారి పాట రికార్డు సొంతం చేసుకుంది. RRR, రాధేశ్యామ్, భీమ్లానాయక్ ఈ జాబితాలో ఉన్నాయి.
Phenomenal
The Superstar streak continues..!
#BlockBusterSVP #SarkaruVaariPaata Crossed $𝟏.𝟖𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 Gross mark in the USA
@urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @GMBents @MythriOfficial @14ReelsPlus @FlyHighCinemas @ShlokaEnts #SVPUsaSandhadi #SVP pic.twitter.com/f1Mlp2TZbb
— FlyHigh Cinemas (@FlyHighCinemas) May 15, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Ormax Media: తెలుగులో టాప్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా.? ఓర్మాక్స్ మీడియా సర్వేలో తేలిన విషయాలివే..
Viral: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత.. ఆ గుట్ట పైకి ఎక్కితే రంగు మారుతున్న మనుషుల శరీరాలు..!


