Most Recent

DJ Tillu: వైజాగ్‌లో సందడి చేసిన డీజే టిల్లు.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

Dj Tillu

DJ Tillu: విశాఖ పట్నంలో డీజే టిల్లు ఫేం సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి హంగామా చేశారు. విశాఖ లో కళా వైభవ్ పేరుతో ప్రారంభం అయిన సరికొత్త వస్త్ర దుకాణం వద్ద ‘లాలా గూడా.. అంబర్ పేట’ అంటూ డీజే టిల్లు సినిమా పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. విశాఖ, ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీటీడీ చైర్మన్, విశాఖ వైసీపీ రీజనల్ ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ విశాఖ లో ఇంత విశాలమైన ప్రాంగణంలో మల్టీ బ్రాండ్ తో ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించి ఆశీర్వదించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కడియాల మోహినీ మాట్లాడుతూ కళా వైభవ్ అన్నది ఒక బ్రాండ్ మాత్రమే కాదని, ఒక సరికొత్త జీవన విధానమన్నారు. ఒక నూతన సంప్రదాయాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో కేవలం వ్యాపారాత్మక ధోరణి మాత్రమే కాకుండా బట్టల ద్వారా ఒక హుందాతనం, గౌరవాన్ని పెంపొందించాలన్నది తమ ఉద్దేశమని అన్నారు. అందుకే అన్ని చోట్ల దొరికే వస్త్రాలులా ఉన్నా సరికొత్త డిజైన్లు, ఎక్కువ మన్నిక తో పాటు సరికొత్త ఫ్యాషన్స్‌ని విశాఖ వాసులకు పరిచయం చేసే ఉద్దేశంతో కళా వైభవ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్‌..

ఇక సిద్ధూ, నేహా శెట్టి కూడా కళా వైభవ్ కలెక్షన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాగా షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హీరో, హీరోయిన్లు వచ్చారని తెలియగానే అభిమానులు భారీగా తరలివచ్చారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమర్ నాథ్ తో పాటు ఎమ్మెల్యేలు అవాంతి శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ, కల్యాణి, మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: పాముతో పరాచకాలాడుతున్న యువతి.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్‌..!

Health Tips: ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.