Most Recent

Manchu Laxmi: ‘లేచింది మహిళా లోకం’ అంటోన్న మంచు లక్ష్మీ.. సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇస్తోన్న సురేఖ వాణి కూతురు..

Manchu Laxmi

Manchu Laxmi: మల్టీ ట్యాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది మంచు లక్ష్మీ. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ (Webseries) నటిస్తూ మెప్పిస్తున్న లక్ష్మీ.. ఇటీవల యూట్యూబ్‌ (Youtube) చానల్‌ ద్వారా కూడా ప్రేక్షకులకు సుపరిచితమైన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు లక్ష్మీ. చివరిగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ‘పిట్టకథలు’ వెబ్‌ సిరీస్‌ తర్వాత మంచు లక్ష్మీ తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించేసింది.

మంచు లక్ష్మీ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ‘లేచింది మహిళా లోకం’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ శుక్రవారం మొదలైంది. కార్తీక్-అర్జున్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘విప్లవం మొదలైంది’ అన్న విభిన్న ట్యాగ్‌లైన్‌తో సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసిన మంచు లక్ష్మీ.. ‘నా కొత్త సినిమా ప్రారంభమైంది. మా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లో జాయిన్‌ అవుదామా అని ఎదురు చూస్తున్నాను. ఇది మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోనుంది’ అంటూ పోస్ట్‌ చేసింది లక్ష్మీ.

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

ఇక మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. శ్రద్ధాదాస్‌, సీనియర్‌ నటి హేమ, హరితేజతో పాటు ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా నటిస్తోంది. మొన్నటి పలు షార్ట్‌ మూవీస్‌, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న సుప్రిత తొలిసారి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Watch Video: ఒకే ఓవర్లో 5 సిక్సులు, ఒక ఫోర్.. 64 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. బౌలర్లను ఉతికారేసిన ప్లేయర్..

MP video: పార్లమెంట్‌లో పోర్న్‌ వీడియోలు చూస్తూ.. అడ్డంగా బుక్కైన ఎంపీ.! తరువాత ఎం అయ్యిందో తెలుసా..?

Coal Crisis: బొగ్గు కొరతను అధిగమించేందుకు చర్యలు.. రాష్ట్రాల జెన్‌కో అధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.