Most Recent

Lavanya Tripathi: ఇంట్రస్టింగ్ కథతో రానున్న అందాల లావణ్య.. ఆకట్టుకుంటున్న పోస్టర్

Lavanya

కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా మత్తువదలరా(Mathu Vadalara) సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు రితేష్ రానా. తోటి సినిమాతోనే విమర్శకుల ప్రశంశలు అందుకున్న రితేష్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హ్యాపీ బర్త్‌డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రితేష్. ఈ సినిమాలో అందాల భామ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు.

తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ తో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా అందర్ని ఆకట్టుకుంటుంది. చేతిలో గన్స్‌తో ఎగురుతున్నట్లు లావణ్యత్రిపాఠి ఈ పోస్టర్‌లో కనిపించడంతో అందరిలోనూ ఈ చిత్ర కథపై ఆసక్తి పెరిగింది. ఈ పోస్టర్ చూస్తే మాత్రం తప్పకుండా ఇది రితేష్ రానా దర్శకత్వంలో రానున్న మరో వినూత్న హిలేరియస్ ఎంటర్‌టైన్‌ర్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

Lavanya Tripathi

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.