Most Recent

Nayanthara: షిర్డీ సాయి సన్నిదిలో ప్రేమ పక్షులు.. చూడముచ్చటగా నయ్‌, విఘ్నేష్‌ల జంట..

Nayanathara

Nayanthara: హీరోలతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న అతి కొద్ది మంది నటీమణుల్లో నయనతార ఒకరు. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకున్న ఈ చిన్నది లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోందీ ముద్దుగుమ్మ. ఇక సినిమాల పరంగా నిత్యం బిజీగా ఉండే ఈ చిన్నది, వ్యక్తిగత జీవితం విషయంలో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌తో ఈ చిన్నది చేసే సందడి మాములుగా ఉండదు.

గతంలో రెండు సార్లు ప్రేమలో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న నయనతార, ఇక జీవితమంతా విఘ్నేష్‌తోనే అన్న భావనలో ఉంది. దీనికి నిదర్శనమే వీరిద్దరు కలిసి జీవిస్తోన్న విధానం. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే గతంలో నయనతార ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో కనిపించడంతో అంతా నిశ్చితార్థం అయ్యింది అనుకున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేరీ కపుల్‌. ఇక ఏమాత్రం టైమ్‌ దొరికినా రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే ఈ ప్రేమ పక్షులు తాజాగా షిర్డీ సాయి బాబా ఆలయాన్ని సందర్శించుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

దర్శనం అనంతరం గుడి ప్రాంగణంలో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు విఘ్నేష్‌ శివన్‌. ఈ ఫోటోతో పాటు.. ‘షిర్డీలో నా కన్మనీతో. షిర్డీ సాయిని దర్శించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇక విఘ్నేష్‌ దర్శకత్వంలో ఇటీవల ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనాతర కన్మనీ అనే పాత్రలో నటించింది. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయం అందుకున్న నేపథ్యంలోనే విఘ్నేష్‌ షిర్డీ వెళ్లినట్లు తన పోస్టులో తెలిపాడు. మరి ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జంట తమ పెళ్లిపై అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

Chandrababu Naidu: అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పన్నులెక్కువ.. వైసీపీపై మరోసారి ధ్వజమెత్తిన చంద్రబాబు..

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.