Most Recent

Sree Vishnu: ఇంతవరకు రాని కొత్త కోణం మా సినిమాలో ఉంది.. హీరో శ్రీవిష్ణు ఆసక్తికర కామెంట్స్

Sree Vishnu

ప్రామిసింగ్ హీరో శ్రీవిషు(Sree Vishnu)ఎంపిక చేసుకునే కథలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అందుకే ఆయన సినిమా నేటి తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఈ కుర్ర హీరో హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా మరో సినిమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరో,హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే 6 న  సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు చైతన్య దంతులూరి ఈ కథ నాకు బాణం సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను అని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా ఈ ప్రొడక్షన్ వేరే వేరే అనుకున్నాం చివరిగా సాయి కొర్రపాటి రావడంతో ఈ సినిమాకు ఒక క్రేజ్ ఏర్పడింది అన్నారు.

ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది.  క్లైమాక్స్ లో  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు శ్రీవిష్ణు. కె.జి.ఎఫ్. వంటి అంత పెద్ద సినిమాలో చేసిన గరుడ రామ్ నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు. డెఫినెట్ గా మంచి బేనర్ లో చేశానని తృఫ్తి వుంది. సాయి కొర్రపాటి క్యాస్టింగ్ గాని టెక్నీషియన్స్ గానీ, నిర్మాణ విలువల్లో కానీ వెనుకంజ వేయరు. ఆయనకు అన్నింటిలోనూ అనుభవం ఉంది. ఇటీవల వచ్చిన వారాహి సినిమాలో మా సినిమా ది బెస్ట్ సినిమా అవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు శ్రీవిష్ణు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.