Most Recent

Karthi’s Kaidhi: కార్తీ సూపర్ హిట్ మూవీ ఖైదీకి అరుదైన ఘనత.. ఏకంగా రష్యాలో రిలీజ్

Kaidhi

తమిళ్ స్టార్ హీరో కార్తీ(Karthi) సినిమాలకు ఇతరభాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కార్తీ విజయాలను అందుకుంటున్నారు. కార్తీ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక ఆయన నటించిన సినిమాల్లో ఖైదీ( Kaidhi) సినిమాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటుడిగా కార్తీని మరో మెట్టు పైకి ఎక్కించింది. 2019 అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి బాక్సీఫీస్ వ‌ద్ద క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమా నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ ఖైదీ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల‌లో నటించారు.

ఇండియాలో ఒక స్టార్ హీరో న‌టించిన చిత్రంలో హీరోయిన్‌, పాట‌లు వుండ‌డం స‌హ‌జం. కానీ ఖైదీ చిత్రం ఆవిష‌యాన్ని బ్రేక్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ లేదు.. పాటలూ లేవు. ఇలాంటి విభిన్న‌మైన ఖైదీ చిత్రం హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి దక్షిణ భారత భాషలన్నింటిలోనూ ‘ఖైదీ’ ట్రెమండ‌స్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ప్రస్తుతం, ఈ చిత్రం హిందీ రీమేక్, ‘భోలా’ పేరుతో నిర్మాణంలో ఉంది, ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘భోలా’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్, రిలయన్స్, డి-సిరీస్ మరియు అజయ్ దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పుడు రష్యాలో భారీ ఎత్తున విడుదలవుతున్న`ఖైదీ` మరో మైలురాయిని సృష్టించనుంది. ‘ఉస్నిక్’ పేరుతో దాదాపు 121 నగరాల్లో 297 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. రష్యాలో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. దీని కోసం వివిధ ప్రచార కార్యక్రమాలు మరియు ఈవెంట్‌ల‌ను ప్లాన్ చేశారు. 4 సీజన్స్ క్రియేషన్స్ రష్యాలో ‘ఉస్నిక్’ని విడుదల చేస్తోంది. 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన తమ చిత్రం `ఖైదీ`’ రష్యాలో భారీ స్థాయిలో విడుదల కానుండటం పట్ల డ్రీమ్ వారియర్ సంతోషంగానూ గర్వంగా ఉంద‌ని పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Bharadwaj: నయా అందాలతో ఆకట్టుకుంటున్న అను లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Priyamani: ఆరెంజ్ డ్రెస్ లో మతిపోగుడుతున్న ప్రియమణి.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Deepika Padukone: కొర చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.