Most Recent

Imran Khan: విడిపోయేందుకు సిద్ధమైన మరో బాలీవుడ్ జంట.. మామ ఆమిర్‌ ఖాన్ బాటలోనే అల్లుడు కూడా..

Imrankhan

Imran Khan: ప్రస్తుతం సినిమా పరిశ్రమలో విడాకుల ట్రెండ్ నడుస్తుంది. మొన్న సమంత- నాగచైతన్యలు విడాకులు తీసుకుంటే.. నిన్న హీరో ధనుష్ దంపతులు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికారు. అంతకుముందు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌- కిరణ్‌ రావ్‌ దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆమిర్‌ మేనల్లుడు.. హీరో ఇమ్రాన్ ఖాన్ కూడా అదే బాటలోనే పయనిస్తున్నాడు. తన సతీమణి అవంతిక మాలిక్‌తో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైపోతున్నట్లు సమాచారం. కాగా 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇమారా అనే ఏడేళ్ల కూతురు కూడా ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరు విడిపోతున్నట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

11 ఏళ్ల బంధానికి వీడ్కోలు..

కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ 2008లో జానే తు యా జానే నా సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కిడ్నాప్‌, ఢిల్లీ బెల్లీ, ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌, గోరీ తేరే ప్యార్‌ మే వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఆయన చివరగా 2015లో కట్టి బట్టి సినిమాలో కనిపించాడు. ఆతర్వాత సిల్వర్‌స్ర్కీన్‌కు దూరంగా ఉన్నాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. అవంతికతో ఎనిమిదేళ్లు ప్రేమించి ఆతర్వాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. 2011లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. 2014లో వీరికి ఇమారా పుట్టింది. అయితే పెళ్లైన కొన్నేళ్లుగా వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే 2019 నుంచే ఈ దంపతులు విడిగా ఉన్నారని సమాచారం. ఈక్రమంలోనే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఎంతోమంది వీరిని కలపడానికి ట్రై చేసినా ఇమ్రాన్‌ మాత్రం ఒక్క మెట్టు కూడా తగ్గడం లేదట. పెళ్లి అనేది తన జీవితంలో ముగిసిన అధ్యాయమని చెబుతున్నాడట. ఈక్రమంలోనే అవంతిక కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Imran Khan (@imrankhan)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

VIral Photo: చిన్నతనంలోనే నటనలో ఓనమాలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులు తిరగేస్తోన్న ఈ బుడతడిని గుర్తుపట్టారా?

Watch Video: క్రూర మృగాలను మించిపోయారు.. దప్పికతో అల్లాడుతున్న పులి కూనలను గ్రామస్తులు ఏం చేశారంటే.. వీడియో

SCR: ఆ నగరాల మధ్య వేసవి ప్రత్యేక రైలు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.