Most Recent

VIral Photo: చిన్నతనంలోనే నటనలో ఓనమాలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులు తిరగేస్తోన్న ఈ బుడతడిని గుర్తుపట్టారా?

VIral Photo: ఈ ఫొటోలో క్యూట్‌గా లవ్లీగా కనిపిస్తున్నది ఓ టాలీవుడ్ స్టార్‌ హీరో. సినిమా ఇండస్ట్రీలో బలమైన కుటుంబ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే తాతకు తగ్గ వారసుడు అనిపించకున్నాడు. ఎలాంటి పాత్రలకైనా ప్రాణం పోసి అభిమానుల్లో మాస్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అతని అభినయానికి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. అందుకే సినిమా ఇండస్ట్రీలోని పలువురి సెలబ్రిటీలకు అతను అభిమాన హీరోగా మారిపోయాడు. ప్రశంసలతో పాటు అవార్డులు, పురస్కారాలు వెంటపడ్డాయి. అన్నట్లు అతను సింగర్‌, టెలివిజన్‌ ప్రజెంటర్‌ కూడా. రాజకీయ ప్రచారంలోనూ తన వాక్చాతుర్యం, వాగ్ధాటిని నిరూపించుకున్నాడు. ఇలా టాలీవుడ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఆ హీరో మరెవరో కాదు..యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్‌ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టూడెంట్‌ నెం.1గా మొదలెట్టి ఆది, సింహాద్రి సినిమాలతో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాఖీ సినిమాతో మహిళాభిమానులను కూడా సంపాదించుకున్నాడు. నటనలో తనదైన కామెడీతో అదుర్స్‌ అనిపించాడు. బృందావనంతో ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. టాలీవుడ్‌ బాద్‌షా నిలిచి తన టెంపరెంటో చూపించాడు. నాన్నకు ప్రేమతో అంటూనే జనతా గ్యారేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. జైలవకుశలో మూడు పాత్రలను అద్భుతంగా పోషించి అరవింద సమేతతో రాయలసీమ యాసలో అదరగొట్టాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో ఇండస్ట్రీ రికార్డులను కొట్టేసిన అతను నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు తారక్‌ను బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. మరి మనం కూడా ఈ యంగ్‌ టైగర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Sudigali Sudheer: వాంటెడ్ పండుగాడ్ గా వస్తున్న సుడిగాలి సుధీర్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

Kamal Haasan’s Vikram: కమల్ హాసన్ సినిమాకోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ కుర్రహీరో హోమ్ బ్యానర్..

Afghanistan: వార్తలు చదివే యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే.. ఆ దేశంలో పీక్స్ కు చేరిన ఆంక్షలు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.