Most Recent

Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో కేసు నమోదు.. ఆ విషయంలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Karate Kalyani

Karate Kalyani: సినీ నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ మధ్య జరిగిన గొడవ, ఘర్షణ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్విట్టర్ వేదికగా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు గోపీకృష్ణ.. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కరాటే కళ్యాణి బాధితుల్లో మేం కూడా ఒకరమే.. ఓ ఇంటి కొనుగోలు విషయంలో మా నుంచి 3.5 లక్షలు వసూలు చేసి మాతో ఒప్పందం చేసుకుందని.. SBIకు చెల్లించాల్సిన మొత్తాన్ని మేమే చెల్లించాలంటూ బెదిరించారు. ఆమె పురుగు మందు తాగిన వీడియో పంపి భయబ్రాంతులకు గురి చేసిందని బాధితుడు గోపికృష్ణ తెలిపాడు. ఆమె విషయంలో వెంటనే స్పందించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు (SHO) ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.. కరాటే కళ్యాణి బాధితుల్లో ఒకరైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంటూ బాధితుడు తెలిపాడు.

కాగా… ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడ బస్తీలో ఇటీవలే నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ పై ఇచిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కరాటే కళ్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Akshay Kumar: కరోనా బారిన పడ్డ బాలీవుడ్ సూపర్‌ స్టార్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు దూరం..

Sharad Pawar: ఎన్సీపీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు.. సినీనటి అరెస్ట్‌..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.