Most Recent

Akshay Kumar: కరోనా బారిన పడ్డ బాలీవుడ్ సూపర్‌ స్టార్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు దూరం..

Akshay Kumar

Akshay Kumar: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా త్వరలోనే ఫ్రాన్స్ లో ప్రతిష్ఠాత్మకంగా జరిగే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అక్షయ్‌ పాల్గొనాల్సి ఉంది. ఈక్రమంలోనే కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలింది. దీంతో కేన్స్ టూర్‌ని క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్టు ప్రకటించారు అక్షయ్‌. ‘కేన్స్ -2022లో ఇండియా పెవిలియన్‌లో మన సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ఇంతలోనే కొవిడ సోకింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటాను. కేన్స్‌కు వెళుతోన్న బృందానికి శుభాక్షాంక్షలు’ అని ట్వీట్‌ చేశాడీ బాలీవుడ్ సూపర్‌ స్టార్‌. కాగా అక్షయ్‌ కుమార్‌ కరోనా బారిన పడడం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లో ఆయనకు మొదటిసారి కరోనా సోకింది. దాన్నుంచి ఆయన క్షేమంగా కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి కొవిడ్‌ బారిన పడడం గమనార్హం.

కాగా త్వరలోనే పృథ్వీరాజ్‌ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో 2017 మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. వీరితో పాటు సోనూసూద్‌, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రప్రకాష్‌ ద్వివేదీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా జూన్‌ 3న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు అక్షయ్‌. ఇప్పుడు కరోనా సోకడంతో కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022 KKR vs SRH Score: దంచికొట్టిన రస్సెల్‌.. హైదరాబాద్‌ లక్ష్యం ఎంతంటే..

Mohanlal: చిక్కుల్లో మలయాళ సూపర్‌ స్టార్‌.. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు.. ఎందుకోసమంటే?

Fire Accident: అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం.. ఆస్పత్రిలో భారీగా ఎగసిపడుతోన్న మంటలు.. రోగుల ఆర్తనాదాలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.