Most Recent

Sarkaru Vaari Paata collections: నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న BlockbusterSVP ట్యాగ్‌.. మూడో రోజులకు మహేశ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే..

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం సర్కారువారిపాట (Sarkaru Vaari Paata). పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. మే12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కొన్ని చోట్ల నెగెటివ్‌ టాక్‌ వచ్చినా వసూళ్లలో మాత్రం అసలు తగ్గేదేలే అంటోంది. మహేశ్‌ పవర్‌ ప్యాక్డ్‌ ఫెర్ఫామెన్స్‌ను చూడడానికి అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మహేశ్‌ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. కాగా విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 103 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన సర్కారు వారి పాట వీకెండ్‌లో మరింత జోరు చూపించింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో BlockbusterSVP హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్రెండ్‌ అవుతోంది.

100 కోట్ల క్లబ్‌లో..

ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన సర్కారు వారి పాట మూడో రోజున మరో 15 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో రెండు రోజుల్లోనే1.6 మిలియన్స్‌ డాలర్లను కలెక్ట్‌ చేసి మరోసారి టాలీవుడ్‌ సత్తాను చాటిందీ చిత్రం. కాగా ఈ ఏడాదిలో 100 కోట్ల గ్రాస్ సాధించిన నాలుగో చిత్రంగా సర్కారు వారి పాట రికార్డు సొంతం చేసుకుంది. RRR, రాధేశ్యామ్, భీమ్లానాయక్‌ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

RBI Gold: సెంట్రల్‌ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు 760 టన్నులు

Chanakya Niti: వారిని అస్సలు వదులుకోకండి.. నమ్మితే ప్రాణాలిస్తారు.. చాణక్యుడు ఏమన్నాడంటే..?

Viral Video: ఎంత నిద్రనో మరీ.. అయ్యయ్యో పట్టుకోండి.. పట్టుకోండి..! నెట్టింట వీడియో వైరల్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.