Most Recent

Vikram Trailer: కమల్‌ హాసన్ ‘విక్రమ్‌’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొడుతున్న ముగ్గురు స్టార్లు..!

Vikram Trailer Released

Vikram Trailer: కమల్‌ హాసన్ నటిస్తున్న విక్రమ్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాని మేకర్స్‌ జూన్‌ 3 విడుదల చేయనున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ముగ్గురు స్టార్ల లుక్స్‌, యాక్టింగ్‌ కన్నుల పండువగా ఉంది. ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొడుతున్నారు. ట్రైలర్ చూసిన వారికి గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన సినిమా పోస్టర్లు, టీజర్లు, ఫస్ట్ సింగల్ విపరీతంగా ఆకట్టుకుంటుండగా ఇప్పుడు ట్రైలర్ దుమ్ము లేపుతోంది. దీంతో కమల్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. సింహం, పులి, చిరుతపులి ఒక అడవికి వేటకు వెళితే అని కమల్‌ హాసన్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ గ్యాంగ్‌స్టర్స్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. కమల్‌ హాసన్‌ రా ఏజెంట్‌గా కనిపిస్తారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో కమల్‌, విజయ్‌, ఫహద్‌ లుక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. కమల్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారని అంటున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాల తర్వాత లోకేష్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ‘విక్రమ్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LSG vs RR: లక్నోపై సూపర్ విక్టరీ సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి..

Ketaki Chithale: సినీనటి కేతకి చితాలేపై సిరా చల్లిన ఎన్సీపీ కార్యకర్తలు..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.