Most Recent

The Warriorr: అదరగొట్టిన రామ్.. షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్.. మరోసారి మెస్మరైజ్ చేసిన దేవీ శ్రీ

Ram

యంగ్ హీరో రామ్ పోతినేని జోరు పెంచారు. ఇస్మార్ట్ శంకర్.. రెడ్ సినిమాలతో హిట్స్ కొట్టిన ఈ కుర్ర హీరో ఇప్పుడు వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ది వారియర్'(The Warriorr )మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది వారియర్. తాజగా ఈ సినిమానుంచి అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేశారు.

దేవీశ్రీ మ్యూజిక్ డైరెక్షన్ లో బుల్లెట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పాటను తమిళ్ స్టార్ హీరో శింబు ఆలపించారు.  ఈ పాటను రికార్డ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఆల్రెడీ విడుదల చేసిన రామ్ స్టిల్స్, ఆది పినిశెట్టి లుక్స్, కృతి శెట్టి లుక్స్ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను అందుకునేలా లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: అందాలతో ఫ్యాన్స్ హృదయాలను లాక్ చేస్తున్న ఆమ్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Meenakshi Chaudhary:పింక్ శారీ లో పిచ్చెకిస్తున్న మీనాక్షి.. ఇంత అందానికి ఫిదా కానీ వారుంటారా

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.