Most Recent

RRR: ఎత్తర జెండా జపాన్‌ వెర్షన్‌.. చెర్రీ, తారక్‌, అలియాలను దింపేశారంతే.. వీడియో చూస్తే మీరు కూడా వావ్‌ అంటారు..

Rrr Japan Version

Japan Cover Song: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). దర్శక ధీరుడు రాజమౌళి (Rajamuli) తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకు గతంలో ఏ భారతీయ చిత్రానికి రాని విధంగా వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమాలోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌, ఎలివేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు వీటిని అనుకరిస్తూ స్పూఫ్‌లు, రీల్స్‌ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన హీరోమునియేరు (Hiromunieru) అనే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువగా తెలుగు సినిమాల పాటలు కవర్ సాంగ్స్, ప్రాంక్, ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ వీడియోలో కనిపించే ఆ ముగ్గురు అన్నా చెల్లెల్లు. వీరికి ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. అందుకే, వీరి వీడియోల్లో చాలావరకు ఎన్టీఆర్ పాటలే ఉంటాయి. గతంలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలోని చీమ చీమ సాంగ్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాట వరకు అన్ని పాటలకు స్ఫూప్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే సినిమాలోని ఎత్తర జెండాను ఎత్తుకున్నారు.

అచ్చుగుద్దినట్లు..
పాటలో భాగంగా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అలియా భట్‌లు ఎలాంటి దుస్తులు ధరించారో అలాంటి వాటినే హీరోమునియేరు బృందం ధరించింది. వారు ఎలాంటి స్టెప్పులేశారో అచ్చు గుద్దినట్టు అలానే వేసి అభిమానులను, నెటిజన్లను కట్టిపడేశారు. అంతేకాదు ఒరిజినల్‌ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే వస్తువులు, ఫొటోలతో సహా అన్నింటినీ దింపేశారు. వీరి క్రియేటివిటీ, డ్యాన్స్‌ ట్యాలెంట్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న ఎత్తర జెండా జపాన్‌ వెర్షన్‌ సాంగ్‌తో పాటు కవర్‌ సాంగ్‌తోపాటు హీరోమునియేరు బృందం చేసిన కొన్ని స్ఫూప్‌ వీడియోలను మీరు చూసేయండి.

Also Read:Jbardastha Varsha: బ్లూ డ్రెస్ బుల్లితెర బ్యూటీ.. వర్ష హోయలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Viral Video: పై ఫోటో చూసి బొమ్మలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

AP Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.