Most Recent

Shruti Haasan: శృతిహాసన్‌కు చిర్రెత్తుకొచ్చే ప్రశ్న అడిగిన నెటిజన్.. అమ్మడు ఏం చేసిందంటే..

Shruti Haasan

సినిమాలతో కంటే సోషల్ మీడియాలో అభిమానులతో ఎక్కువ టచ్ లో ఉంటారు. నిత్యం రకరకాల ఫొటోలతోపాటు వీడియోలతో అభిమానులు ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ ఉంటారు. ఏమైనా అడగండి సమాదానాలు చెప్తం అంటూ.. అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి ప్రశ్నలతో హీరోయిన్స్ ను విసిగిస్తూ ఉంటారు. తాజాగా అలాటి పరిస్థితే అందాల భామ శృతిహానాస్(Shruti Haasan)ను ఎదురైంది. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చాలా కూల్ గా సమాధానం చెప్పింది శృతి. అయితే ఓ అభిమాని మాత్రం శృతిహాసన్ కు చిర్రెత్తుకొచ్చే ప్రశ్న అడిగాడు దానికి శృతి కూడా కొచం ఘాటుగా స్పందించింది. ఇంతకు ఆ అభిమాని శృతిహాసన్ ను ఏమడిగాడంటే..

చాలా మంది అభిమానులు శృతిని తన సినిమాల గురించి కెరీర్ గురించి రకరకాల ప్రశ్నలు అడిగారు. అయితే ఒక నెటిజన్ మాత్రం మితిమీరి.. మీరు మీ బాడీలో ఏ పార్ట్స్ కు సర్జరీ చేయించుకున్నారు.? అని అడిగాడు. దానికి శృతి స్పందిస్తూ.. నీ పని నీవు చూసుకుంటే మంచిది అని చెప్తూనే.. అడిగావు కనుక చెప్తున్నాను అంటూ.. ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నట్లుగా చెప్పింది. శృతి హాసన్ ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయం చాలా మందికి తెల్సిందే. శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేస్తోంది. బాలకృష్ణ తో కలిసి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.