
Kaathuvaakula Rendu Kaadhal: తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతను నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఉప్పెన సినిమాతో నేరుగా టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ (Kaathuvaakula Rendu Kaadhal). ఈ సినిమాలో నయనతార (Nayanatara), సమంత (Samantha) హీరోయిన్లు గా నటిస్తున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ, 7 స్ర్కీన్స్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ స్పీడ్‌ను పెంచేసింది. సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సేతుపతి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళుతోంది.
సమంత పుట్టిన రోజే..
కాగా ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం నుంచి విడుదలైన పాటలు సంగీతాభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా మరొక పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. డిప్పం, దప్పం అనే లిరిక్స్ తో సాగే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ పాటకు 4 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇందులో విజయ్, సమంతల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ సాహిత్యం అందించగా ఆంథోని డాసన్, అనిరుధ్ ఆలపించారు. కాగా ఈ పాట లిరిక్స్ తనకు ఎంతగానో నచ్చాయని సమంత పేర్కొంది. కాగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. అదే రోజు సమంత పుట్టిన రోజు కావడం విశేషం.
Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!
Immunity Boost: రోగనిరోధక శక్తిని పెంచుకునే ఈ 4 విటమిన్లు గురించి మీకు తెలుసా.