
RajiniKanth: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కేజీఎఫ్ ఛాప్టర్ 2 మేనియానే కనిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం శాండల్‌వుడ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ రాకీభాయ్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హీరో యశ్ యాక్టింగ్‌కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను చూసారట. ఈ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమకు భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిచారంటూ అభినందించారట. ఈ సందర్భంగా కేజీఎఫ్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారని ప్రముఖ విశ్లేషకుడు మనోబాల సోషల్ మీడియా వేదకిగా తెలిపారు. అంతేకాదు రజనీనే స్యయంగా కేజీఎఫ్ దర్శక, నిర్మాతలకు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని ప్రశంసించినట్లు తెలుస్తోంది.
కాగా మొదటి రోజే రూ. 150 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి కలెక్షన్ల లో సరికొత్త చరిత్రను సృష్టించింది ఆదివారం నాలుగో రోజు సాధించిన రూ. 132.13 కోట్లతో కలుపుకుని ఇప్పటివరకు రూ. 551.83 కోట్లకు చేరుకుంది. ఫస్ట్ డే గురువారం రూ. 165.37 కోట్లు, శుక్రవారం రూ. 139.25 కోట్లు, శనివారం రూ. 115.08 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇక హిందీలోనూ దుమ్ములేపుతున్నాడు రాఖీభాయ్. ఇప్పటికే అక్కడ వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. మరి రానున్న రోజుల్లో ఈ విజువల్ వండర్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Superstar #Rajinikanth watched #KGFChapter2 and praised the team for delivering a blockbuster movie.
— Manobala Vijayabalan (@ManobalaV) April 16, 2022
Also Read: Tulip Garden: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ క్లోజ్ చేశారు.. కారణం ఇదే..
BIS Recruitment: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 337 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.