
Acharya: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య (Acharya). డైరెక్టర్‌గా ఇప్పటివరకు అపజయమెరుగని కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ మెగా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా ..తాజాగా ఈ సినిమా నుంచి భలే భలే బంజారా పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక మరోవైపు చిరు, చరణ్, డైరెక్టర్ కొరటాల శివ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా ఈ మెగా మూవీపై గతంలో రీషూట్ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన కొరటాల శిప పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రీషూట్ చేయడం తప్పేమీ కాదు..
‘సినిమా రీషూట్ చేస్తే అదొక తప్పుగాచూస్తారు. అలా ఎందుకు భావిస్తారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఒక సన్నివేశాన్ని రీటేక్ చేశాం అంటే మరింత బెటర్ అవుట్‌పుట్ కోసమే కదా? ఒక సీన్‌ను ఇంతకన్నా బాగా తీయొచ్చు అనే ఆలోచన దర్శకులకు వచ్చినప్పుడు రీషూట్ చేయడం తప్పేమీ కాదు. అనుకున్న సీన్ సరిగా రానప్పుడు దానిని అలా వదిలేయడం తప్పు అవుతుంది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను వందశాతం సంతృప్తి పరచడమే మా ధ్యేయం. మరి వారికి మంచి అనుభవాన్ని అందించడం కోసం రీ షూట్‌కి వెళ్లడం తప్పు ఎలా అవుతుంది? అలాంటివి ఏమైనా చేయాలి అనిపిస్తే నిర్మాతను ఒప్పించి ముందుకెళ్తాను. ఇక చాలామంది అనుకుంటున్నట్లు ఆచార్య చిత్రం రీషూట్ చేయలేదు. ఆ అవసరం కూడా మాకు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు శివ.
Also Read: AP News: టీడీపీ లీడర్స్ చంద్రబాబు, లోకేశ్ పై కేసు.. కల్యాణదుర్గం ఠాణాలో ఫిర్యాదు
Delhi Violence: కాల్పులు జరిపిన సోనూ చిక్నా అరెస్ట్.. ఢిల్లీ అల్లర్ల కేసులో చురుగ్గా పోలీసుల దర్యాప్తు..
కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్ట్‌గా చెల్లింపులు..!