Most Recent

Alia- Ranbir wedding: కత్రినా, కరీనా, దీపిక, ప్రియాంక.. కొత్త దంపతులకు ఎవరెవరు ఏమేం కానుకలు ఇచ్చారంటే..

Alia Ranbir Wedding

Alia Bhatt- Ranbir Kapoor:  ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటూ ఏప్రిల్ 14న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు అలియా భట్‌, రణ్‌బీర్ కపూర్. అంగరంగ వైభంగా జరిగిన ఈ వివాహ వేడుకకు బాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కరీనా కపూర్, కరిష్మా కపూర్‌, సైఫ్ అలీఖాన్, అయాన్ ముఖర్జీ, కరణ్‌ జొహర్‌, మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌, ఆకాశ్ అంబానీ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పాల్గొని సందడి చేశారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్‌ సోషల్‌ మీడియా వేదికగా అలియా- రణ్‌బీర్‌ (Alia Bhatt- Ranbir Kapoor)లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఖరీదైన కానుకలు పంపించారు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్ తదితర సెలబ్రిటీలు కొత్త దంపతులకు కాస్ట్‌లీ ఆభరణాలు, వస్తువులు బహుమతులుగా అందజేశారు.

అల్లుడికి రూ.2.5 కోట్ల ఖరీదైన వాచ్‌..

రణ్‌బీర్‌ కపూర్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన కత్రినా కైఫ్‌ కొత్త దంపతులకు రూ.14.5 లక్షల విలువైన ప్లాటినం బ్రేస్‌లైట్‌ను బహుమతిగా ఇచ్చిందట. ఇక దీపికా పదుకొణె నూతన దంపతులకు విడివిడిగా ఖరీదైన వాచ్‌లను కానుకగా ఇచ్చిందట. ఇక దీపిక భర్త రణ్‌వీర్‌ సింగ్‌ లగ్జరీ బైక్‌ను రణ్‌బీర్‌ కపూర్‌కు గిఫ్ట్‌ గా ఇచ్చాడట. కాగా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతోనే అలియా భట్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతోనే ఆమెతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరందరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈక్రమంలో జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన అలియాకు రూ.మూడు లక్షల విలువ గల లగ్జరీ హ్యాండ్ బ్యాగును కానుకగా ఇచ్చాడు సిద్దార్థ్ మల్హోత్రా. వరుణ్ ధావన్ కూడా అలియాకు రూ. నాలుగు లక్షల ఖరీదు గల సాండల్స్‌ను గిఫ్ట్‌గా పంపించాడట. ఇక గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా రూ. 9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కొత్త పెళ్లి కూతురుకు కానుకగా ఇచ్చిందట. ఇక కరీనా కపూర్ రూ. మూడు లక్షల విలువ జేసే డైమండ్ నెక్లెస్‌‌ను బహుమతిగా అందించిందట. ఇక రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ నూతన దంపతులకు ఏకంగా రూ.26కోట్ల విలువ జేసే విలాసవంతమైన ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చారట. ఇక అలియా తల్లి సోనీ రజ్దాన్‌ అల్లుడికి రూ.2.5 కోట్ల ఖరీదైన వాచ్‌ను బహూకరించారట.

Also Read: Vijay Devarakonda- Samantha : సమంత -విజయ్ దేవరకొండ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే

CONGRESS STRATEGY: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం.. యుపీఏ బలోపేతానికి తొలి స్టెప్.. మొత్తం వ్యూహమిదే!

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో 337 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.