Most Recent

స్టార్ హీరో టు సీఎం: దళపతి ‘విజయ’ రహస్యాలు చెప్పేసిన ఫిట్‌నెస్ ట్రైనర్

స్టార్ హీరో టు సీఎం: దళపతి ‘విజయ’ రహస్యాలు చెప్పేసిన ఫిట్‌నెస్ ట్రైనర్

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, భారీ విజయం సాధించిన దళపతి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వెండితెరపైనే కాదు, ఫిట్‌నెస్ విషయంలోనూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాత్రింబవళ్లు ప్రజల్లో ఉంటూ, తీరికలేని రాజకీయ షెడ్యూల్ గడుపుతున్నప్పటికీ ఆయన అంత శక్తిమంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన పాటించే కఠినమైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన వ్యాయామం గురించి ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ పంచుకున్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

క్రమశిక్షణే గెలుపు పునాది

విజయ్ కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ అత్యంత నిబద్ధతతో ఉంటారని నరేష్‌ కుమార్‌ కొనియాడారు. ఎంతటి బిజీ షెడ్యూల్‌ ఉన్నా, తన ఆరోగ్యాన్ని ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరని తెలిపారు. ముఖ్యంగా రాజకీయ ర్యాలీలు, బిజీగా ఉండే సమయాల్లో కూడా ఆయన తన భోజనాన్ని తానే వెంట తీసుకువెళ్తారని, బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని వెల్లడించారు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు పోటీనిచ్చేలా ఆయన ఫిజిక్ ఉండటం వెనుక సాధారణ స్థాయికి మించిన క్రమశిక్షణ ఉందని పేర్కొన్నారు.

ఒత్తిడిని జయించే మార్గాలు

రాజకీయాల్లో ఉండే విపరీతమైన ఒత్తిడిని విజయ్ చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారని ట్రైనర్ తెలిపారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆయన సైక్లింగ్‌, జిమ్‌ సెషన్‌లు, రన్నింగ్‌ వంటి మార్గాల ద్వారా మనసును తేలికపరుచుకుంటారని చెప్పారు. ఇప్పటి వరకు ఆయనకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు రాకపోవడానికి ఆయన అనుసరించే నిలకడైన వ్యాయామమే కారణమని అన్నారు. ప్రతి పనిని నిశబ్దమైన ఏకాగ్రతతో చేయడం విజయ్‌ ప్రత్యేకత.

విజయ్‌ విజయం కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదని, అది ఆయన అంకితభావం మరియు అభిరుచికి నిదర్శనమని నరేష్ కుమార్ అభివర్ణించారు. సెట్‌లో ప్రతి ఒక్కరినీ సమాన గౌరవంతో చూడటం, ఆయనలోని వినయం ప్రజలకు ఆయన్ని మరింత దగ్గర చేశాయన్నారు. ఏ రంగంలోనైనా నిలకడతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయం తథ్యమని చెప్పడానికి విజయే నిదర్శనమని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.