
సినిమా ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో సింగర్ గా చేసిన ఈ అమ్మడు ఆతర్వాత హీరోయిన్ గీతా మారిపోయింది. అనగనగ ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది. అంతే ఆ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది. వరుస సినిమాలతో బిజీ అయ్యింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ..
ఇది కూడా చదవండి : Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..
కేవలం హీరోయిన్ గానే కాదు సింగర్ గాను ప్రతిభ చాటుకుంటుంది శ్రుతిహాసన్. ఇటీవలే వారణాసి సినిమా కోసం సంచారి అనే సాంగ్ పాడింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది శ్రుతిహాసన్. ఆమధ్య శ్రుతి రెండుసార్లు ప్రేమలో పడింది. కానీ ప్రేమ ఈ అమ్మడికి కలిసిరాలేదనే చెప్పాలి.. దాంతో తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నా అంటూ తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రుతి తన భక్తి భావన గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు
ఇటీవల శ్రుతిహాసన్ అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండ పై ఉన్న కామాఖ్యా టెంపుల్( వారాహి అమ్మవారు) ను దార్శించుకుంది. వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని శ్రుతి చెప్పుకొచ్చింది. ఇటీవల నేను వారాహీ మాత ఆలయానికి వెళ్లాను. మనమే కాదు.దేవుళ్ళు కూడా మనల్ని ఎంచుకుంటారు. ఒక మిత్రుడు నన్ను టెంపుల్ కు వెళ్దాం రా అని పిలిచాడు. సరే అని వెళ్ళా.. అది చాలా చిన్న ఆలయమే. అయితే గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందాను. ఎలాంటి ఆడంబరం లేదు. వీఐపీల క్యూ లేదు. ఆశ్చర్యంగా అనిపించింది. వారాహి అమ్మవారు శక్తివంతమైన దేవత ’ అని నటి శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.