Most Recent

Rajashekhar: ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డా..! మంచి హిట్ అయ్యింది

Rajashekhar: ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డా..! మంచి హిట్ అయ్యింది

నటుడు రాజశేఖర్ ఒకానొక సమయంలో హీరోగా రాణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రాజశేఖర్. ఇక ఇప్పుడు రూట్ మార్చి సహాయక  పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ మధ్య నితిన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.. ఇక రీసెంట్ గా శర్వానంద్ నటించిన బైకర్ సినిమాలో హారో తండ్రి పాత్రలో మెప్పించారు ఈ సినిమా మంచివిజయాన్ని అందుకున్నారు. అయితే రాజశేఖర్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాను అని తెలిపారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాలను వదులుకున్నట్లు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.

చిరంజీవి నటించిన ఠాగూర్, వెంకటేష్ నటించిన చంటి, అలాగే జెంటిల్మాన్ వంటి భారీ విజయాలు సాధించిన సినిమాలను తాను మిస్ చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తాను వదులుకున్న సినిమాలలో ఏవి హిట్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానంగా, చాలా సినిమాలు ఉన్నాయని రాజశేఖర్ తెలిపారు. కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా చంటి సినిమా గురించి వివరిస్తూ, మొదట తాను ఆ సినిమాను చూడాలనుకున్నానని, మరుసటి రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ రావాలని అనుకున్నానని తెలిపారు.

అయితే, దర్శకుడు వాసు తనకు అంతగా సూట్ అవ్వకపోవచ్చని ఎవరో చెప్పడంతో పాటు, ఉదయాన్నే షూటింగ్ ఉండటంతో తాను ఆ సినిమా చూడకుండానే వచ్చేశానని వివరించారు. తర్వాత వెంకటేష్ నటించిన చంటి సినిమా చూసినప్పుడు చాలా పశ్చాత్తాపపడ్డానని రాజశేఖర్ అన్నారు. ఆ సినిమాను తాను చూసి ఉంటే, వదులుకునేవాడిని కాదని, దాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడేవాడినని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే సహాయక పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ఇటీవలే తెలిపారు రాజశేఖర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.