Most Recent

డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!

డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ డార్లింగ్. అప్పటివరకు యాక్షన్ హీరోగా రాణించిన ప్రభాస్ డార్లింగ్ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అదరగొట్టాడు. మనోడి స్టైల్, డ్రస్సింగ్ , యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డార్లింగ్ సినిమాతో ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యింది. మరోసారి థియేటర్స్ లో డార్లింగ్ సినిమాను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్..

అయితే రీ రిలీజ్ సమయంలో సినిమాలోని గెటప్స్ వేసుకోవడం లేదుగా, సాంగ్స్ కు డాన్స్ చేయడం , ఇంకొంతమంది ఆ సినిమాలోని సీన్స్ ను రీ క్రియేట్ చేయడం చేస్తుంటారు. అలాగే డార్లింగ్ సినిమా రీ రిలీజ్ లోనూ అదే జరిగింది. సినిమాలోని ఇంకా ఎదో అనే సాంగ్ ను కొంతమంది రీ క్రియేట్ చేశారు. సాంగ్ లో ప్రభాస్, కాజల్ వేసుకున్న కాస్ట్యూమ్ తో థియేటర్స్ లో సందడి చేశారు.

ఓ అమ్మాయి అబ్బాయి ఇలా ప్రభాస్కాజల్ అగ్వరల్ లుక్ లో థియేటర్స్ లో సాంగ్ రీ క్రియేట్ చేయడంతో అందరూ అరుపులు, కేకలతో హడావిడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సింగిల్స్.. థియేటర్స్ లో కూడా మమ్మల్ని బ్రతకనివ్వరా..? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది స్కూల్ ఎగ్గొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by మనోజ్ 🐉🦚 (@dmktweetz)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.