Most Recent

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్నాళ్లు సైలెంట్ అయిన శ్వేతా బసు ప్రసాద్.. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకుంది. ఏడాది తిరిగిలోపే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వరుసగా పర్సనల్ లైఫ్ లో సమస్యలు రావడంతో కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగు, హిందీలో అవకాశాల కోసం వెయిట్ చేసింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అలరిస్తుంది. హిందీలో వెబ్ సిరీస్, సినిమాలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలోనే శ్వేతా బసు ప్రసాద్ .. ఇండియా లాక్ డౌన్ అనే సినిమాలో నటించింది. అందులో వేశ్య పాత్రలో నటించింది. అయితే ఇందులో భాగంగా ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే మహిళలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది స్వయంగా తెలుసుకోవడానికి.. తాను ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని కామాటిపురను సందర్శించిందట. కొన్నాళ్ల క్రితం శ్వేత బసు ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

తెలుగులో కొత్త బంగారు లోకం సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్టు అందుకోలేకపోయింది. అలాగే తన ఎత్తు కారణంగా సౌత్ లో ఓ సినిమా షూటింగ్ సమయంలో తనను ఎగతాలి చేశారని చెప్పుకొచ్చింది. తాను నటించే సినిమాలో హీరో చాలా పొడవుగా ఉన్నాడని.. అతడు 6 అడుగులు ఉండగా.. తాను కేవలం 5.2 మాత్రమే ఉన్నానని.. దీంతో తనను ఎగతాలి చేశారని తెలిపింది.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.