Most Recent

Ram Charan-Upasana Twins: కవలలకు జన్మనిచ్చిన ఉపాసన.. గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి..

Ram Charan-Upasana Twins: కవలలకు జన్మనిచ్చిన ఉపాసన.. గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి..

మెగా ఫ్యామిలీలో మరోసారి సందడి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ మరోసారి తండ్రి అయ్యారు. జనవరి 31న శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చరణ్ భార్య ఉపాసన ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని.. తమ కుటుంబంలోకి ఇద్దరు చిన్నారులు రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందని.. ఇది దైవాశీర్వాదమంటూ రాసుకొచ్చారు చిరు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సినీప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

“రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కవలలకు జన్మనిచ్చారు. వారికి ఒక మగబిడ్డ, ఒక ఆడపిల్ల పుట్టారని ఎంతో ఆనందంతో కృతజ్ఞతా భావంతో తెలియజేస్తున్నాము. తల్లి, పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. బాగున్నారు. ఈ చిన్నారులను మా కుటుంబంలోకి స్వాగతించడం తాతయ్య నానమ్మగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి ప్రార్ధనలు, ప్రేమ, ఆశీర్వాదాలకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు మెగా ట్విన్స్ పుట్టారనే వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.