Most Recent

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై బొజ్జా సంధ్యా రెడ్డి స్పందించారు. మహిళల వస్త్రధారణ పద్ధతిగా, నీట్‌గా, నిండుగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని ఆమె వెల్లడించారు. పద్ధతిగా ఉండాలని చెబితేనే కేసు పెడతారా అంటూ ఆమె ప్రశ్నించారు. తనకు కేసులకు భయపడే వ్యక్తిని కాదని, కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని సంధ్యా రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై తన వరకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని, వచ్చిన తర్వాత తన న్యాయవాదిని సంప్రదిస్తానని ఆమె పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సగం సగం దుస్తులతో కనిపించడం వల్ల పిల్లలు ప్రభావితమవుతున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తెచ్చారని సంధ్యా రెడ్డి తెలిపారు. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదిగి, అన్ని రంగాలలో ముందుకు రావడమేనని ఆమె నిర్వచించారు. దుస్తులలో స్వేచ్ఛ లేదని, మన కట్టుబాట్లను, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. అనసూయ పెట్టిన కేసులకు భయపడబోనని సంధ్యా రెడ్డి నొక్కి చెప్పారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.