Most Recent

Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..

Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..

నటి రోహిణి తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబ విలువలు, దర్శకత్వ రంగ ప్రవేశం, సామాజిక బాధ్యత గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్లిమ్‌గా ఉండేందుకు కష్టపడతానని అన్నారు. ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పనిసరి అని ఆమె అన్నారు. బాహుబలి చిత్రంలో బరువు ఎక్కువగా ఉన్నారన్న కామెంట్ల తర్వాత తదుపరి షెడ్యూల్ కోసం తగ్గడానికి ప్రయత్నించానని తెలిపారు. ఐదేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన రోహిణి, మాతృత్వం తనకు ఒక కంప్లీషన్ భావనను ఇచ్చిందని వెల్లడించారు. తల్లిని మిస్ అవుతున్న భావన మాతృత్వం తర్వాత తగ్గిందని చెప్పారు. తన కొడుకు రిషి ఇప్పుడు అట్లాంటాలో చదువుకుంటూ, ఉన్నత విద్యకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. పిల్లల పెంపకంలో సరైన విలువలను అలవర్చడం, సమాజాన్ని, ముఖ్యంగా మహిళలను గౌరవించే విధానాన్ని నేర్పించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తన తండ్రి తన జీవితంలో అమ్మతో సమానమని, తన అల్లరి, చిలిపితనం, కోపం అన్నింటినీ ఎదుర్కొన్నారని, అలాగే తనకు నిజాయితీ, పనిపట్ల అంకితభావం, ఇతరులతో వ్యవహరించే తీరు, నేర్చుకోవాలనే తపన వంటి మంచి విషయాలను నేర్పించారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

పాండమిక్ సమయంలో తండ్రి నాలుగు నెలలపాటు బెడ్ రిడన్ అయినప్పుడు, ఆయ ని దగ్గరుండి చూసుకున్నారు. తండ్రికి స్నానం చేయించడం నుంచి షేవింగ్, హెయిర్ కట్, తినిపించడం వంటి పనులన్నీ స్వయంగా చేశానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చివరికి, పాండమిక్ కారణంగా తన సోదరులు రాలేకపోవడంతో, తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహించానని, ఈ విషయంలో తనకు ఎటువంటి వ్యతిరేకత ఎదురుకాలేదని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

పిల్లలు ఉన్నత చదువుల కోసం దూరంగా వెళ్ళినప్పుడు ఎదురయ్యే ఒంటరితనాన్ని చాలామంది డిప్రెషన్‌కు దారితీస్తుందని, అయితే దీనిని “మీరెవరో తెలుసుకోవడానికి దొరికిన ఒక అపర్చునిటీ”గా చూడాలని రోహిణి సూచించారు. పాటలు నేర్చుకోవడం, ప్రయాణాలు చేయడం, కొత్త సంస్కృతులను తెలుసుకోవడం వంటి ఆసక్తులను అనుసరించమని ఆమె ప్రోత్సహించారు. రఘు ఉండుంటే ఇప్పుడున సినిమా దశను చూసి ఎంతో సంతోషించేవారు. ఒక నటుడిగానూ ఎంతో ఆనందపడేవారని అన్నారు.
1996లో రోహిణిని పెళ్లిచేసుకున్న రఘువరన్.. 2004లో విడాకులు ఇచ్చారు. ఈ దంపతులకు ఏకైక కుమారుడు రిషివరన్. ఇప్పుడు రిషివరన్ వయసు 23 ఏళ్లు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.