Most Recent

Watch Video: హద్దులు దాటిన అభిమానం.. ఉక్కిరిబిక్కిరై కిందపడిపోయిన హీరో విజయ్‌! వీడియో

Watch Video: హద్దులు దాటిన అభిమానం.. ఉక్కిరిబిక్కిరై కిందపడిపోయిన హీరో విజయ్‌! వీడియో

కోలీవుడ్‌ స్టార్ హీరో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ అభిమానుల అత్యుత్సాహంతో జారి కిందపడ్డారు. మలేసియాలో జరిగిన ‘జన నాయగన్‌’ ఆడియో లాంఛ్‌ అనతంర ఆదివారం రాత్రి మలేషియా నుంచి తిరిగి వచ్చిన విజయం చెన్నైకి వచ్చారు. అయితే విజయ్‌కి స్వాగతం పలికేందుకు చెన్నై విమానాశ్రయంకి భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. పోలీసులు వారిని కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారంతా ఒక్కసారిగా గుమికూడటంతో విజయ్‌ కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో సెలబ్రిటీల భద్రత, బహిరంగ ప్రదేశాలలో అభిమానుల అత్యుత్సాహంపై మరోసారి చర్చకు దారి తీసింది. అసలేం జరిగిందంటే..

హీరో విజయ్‌ భారీ భద్రత నడుమ ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వస్తుండగా అధిక సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఆయన వద్దకు దూసుకువచ్చారు. విజయ్‌ కారు వద్దకు వెళ్తున్న సమయంలో అభిమానులు తోసుకుంటూ ముందుకు రావడంతో జారి కింద పడిపోయాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతనికి సహాయం చేయడానికి పరుగెత్తారు. విజయ్‌ని పైకి లేపి, సురక్షితంగా కారులో ఎక్కించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

డిసెంబర్ 27న కౌలాలంపూర్‌లో జరిగిన జననాయగన్ ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన తర్వాత దళపతి విజయ్ మలేషియా నుంచి తిరిగి వచ్చారు. ఈ కార్యక్రమం వేలాది మంది అభిమానులను ఆకర్షించింది. అందుకు కారణం.. ఈ ఈవెంట్‌లో విజయ్ సినిమా నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించడమే. ఇకపై ప్రజా జీవితానికి, రాజకీయాలకు పూర్తిగా అంకితం అవుతున్నానని చెప్పడంతో ఫ్యాన్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. తాను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇసుక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నానని, కానీ అభిమానులు తనకు రాజభవనం నిర్మించారని అన్నారు. అభిమానులు తనకు కోట నిర్మించడంలో సహాయం చేసారు. అందుకే తాను వారి తరపున నిలబడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నా కోసం అన్నీ వదులుకున్న అభిమానుల కోసం నేను సినిమానే వదులుకుంటున్నానని జననాయగన్ మువీ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో విజయ్‌ ప్రకటించారు.

కాగా తాజా ఎయిర్‌పోర్టు ఘటన అభిమానుల నియంత్రణ, ప్రముఖుల భద్రతపై ఆందోళన కలిగించింది. ఇటీవల నటి నిధి అగర్వాల్‌, సమంతకు ఇలాంటి అనుభవాలే ఎదురైన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు బహిరంగ ప్రదేశాల్లో అడుగుపెడితే జనసమూహం వారిని చుట్టుముట్టి అదుపు చేయలేని విధంగా మారుతుంది. అభిమానం హద్దులు దాటేలా ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.