Most Recent

Varanasi Movie: రాజమౌళి ‘వారణాసి’లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రిగా ఎవరు నటించనున్నారంటే?

Varanasi Movie: రాజమౌళి ‘వారణాసి’లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రిగా ఎవరు నటించనున్నారంటే?

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ 2027 లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ‘వారణాసి’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అలాగే మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని ఇతర నటీనటుల గురించి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త సమాచారం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కూడ ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడట.

వారణాసి మూవీలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ యాక్ట్ చేయనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ పాత్ర కోసం చిత్ర బృందం బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను సంప్రదించిందని సమాచారం. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్, రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో ‘విక్రమార్కుడు’ సినిమా టైమ్ లో వీరు కలిసి పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ కలిసి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు ప్రకాశ్ రాజ్. ఆ మధ్యన పవన్ కల్యాణ్ నటించిన ఓజీలో ఓ కీలక పాత్ర పోషించాడీ సీనియర్ నటుడు. అలాగే ప్రస్తుతం దళపతి విజయ్ ‘జన నాయగన్’ లో నూ యాక్ట్ చేస్తున్నాడు.

వారణాసి టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.