Most Recent

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ టాప్-5లో ఉండేది వీళ్లే.. ఈసారి కప్పుకొట్టేది ఎవరో చెప్పేసిన రీతూ చౌదరి

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ టాప్-5లో ఉండేది వీళ్లే.. ఈసారి కప్పుకొట్టేది ఎవరో చెప్పేసిన రీతూ చౌదరి

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14వ వారంలోకి అడుగు పెట్టేసింది. అంటే మరో రెండు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ పడనుంది. ఇక ఈ ఆదివారం (డిసెంబర్ 07) ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. టాప్ కంటెస్టెంట్ గా టాప్-5లో ఉంటుందనుకున్న ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ప్రెస్ మీట్ పెట్టింది రీతు. ఈ సందర్భంగా తన బిగ బాస్ ప్రయాణం, డిమాన్ పవన్ తో రిలేషన్ షిప్ తదితర విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా బి గ్ బాస్ టాప్-5లో ఎవరెవరు ఉంటారని ఒక రిపోర్టర్ రీతూను అడిగాడు. దీనికి ఆమె కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్,సంజన గల్రానీల పేర్లు చెప్పింది. ఇదే సందర్భంగా ఒకరు భరణి పేరు ప్రస్తావనకు తీసుకురాగా ఆయన ఉంటాడో లేదో మీరే చెప్పాలని సైటెర్లు వేసింది. ఇక విన్నర్ ఎవరవుతారని అడగ్గా ఈ మాటకు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు రీతూ.

ఇక మరో సందర్భంలో డిమాన్ పవన్ టాప్-5 లో ఉంటాడా అని అడుగగా.. ‘అవును ఉంటాడు.. నిన్నటి వరకు నేను హౌస్ లో ఉండాలనే ఆడాను. మొదటి రోజు నుంచి నేను బయట ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నాను.. కల్యాణ్ తో క్లోజ్ గా ఉన్నాను.. కానీ దాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు.. డీమాన్ తో ఉన్నదే ఎలివేట్ చేసి చెప్తున్నారు. డీమాన్ పవన్ టాప్-5 లో ఉండాలి.. అతనే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది రీతూ.

బిగ్ బాస్ బజ్ లో రీతూ చౌదరి..

blockquote class=”twitter-tweet”>

Out of the house, but the chaos continues! 👁💥#RithuChowdary #BiggBossBuzzz

Watch #BiggBossBuzzz every Sunday at 10:30 PM on #StarMaa, and every Monday at 10:00 AM & 6:00 PM on #StarMaaMusic#StarMaaPromo pic.twitter.com/7O66aQxCEw

— Starmaa (@StarMaa) December 7, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.